అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజానప్రతినిధులు ప్రజలతో ముఖాముఖి అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీఐపీలు మొదలు సామాన్యుల వరకు ప్రజలతో మమేకం అయ్యేందుకు విశాల ప్రాంగణాలను ఎన్నుకొని వారితో సమావేశం అవుతుంటారు. భారతదేశంలో ఇలాంటి సంప్రదాయం లేదు. స్థానిక సంస్థల ప్రతినిధులు తప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను…ఇలా ఎవరిని కలవాలన్నా అదో పెద్ద ప్రయాస. తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసేందుకు పలువురు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక మంత్రులతో మాట్లాడటం అంటే…అది అయ్యే పనేకాదు అనే భావన అందరిలో నాటుకుపోయింది. కానీ ప్రజలందరినీ భాగస్వామ్యం చేసినపుడే పరిపాలన ఫలాలు అందరికీ అందుతాయని భావించిన మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీఓలు ఇలా…ప్రజలందరితో మమేకం అయ్యేందుకు వేదిక కల్పించారు.
