సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్‌తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్‌గా నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రంలో తనలోని రొమాన్స్‌ను వెలికి తీసింది భామ.
అయితే, తాజాగా నాని, సాయిపల్లవి నటిస్తున్న ఎంసీఏ చిత్రానికి సంబంధించి కొన్ని వాల్‌పోస్టర్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ వాల్‌పోస్టర్‌లో ఒకటి.. ఇద్దరు ఒకరికొకరు మరింత దగ్గరగా ఉన్నారు. దగ్గరగా అంటే.. దారం పోయేందుకు కూడా గ్యాప్లేనంతగా అన్న మాట. అలా ఉన్న వారి స్టిల్‌పై వెండితెర ప్రేక్షకులు ఓ లుక్కేశారు. ఇంతకీ వారు ఏం మాట్లాడుకుంటున్నారబ్బా అన్న చర్చకు తెరలేపారు. దీనికి నెట్టిల్లే వేదిక కావడం మరో విశేషం.
ఒకరేమో.. నాని ముద్దు అడుగుతుండగా.. అందుకు సాయిపల్లవి సిగ్గులొలికిస్తూ.. ఇప్పుడు కాదంటూ రిప్లై ఇస్తుందని, మరొకరేమో.. నాని సరసానికి హద్దూ పొద్దూ లేకుండా పోతుందని కామెంట్ చేశారు. ఒక అడుగు ముందుకేసిన ఓ అభిమాని.. ఐదేళ్ల ఇద్దరు పిల్లలు రోడ్డుపై వెళుతుండగా.. గమనించిన నాని అటువంటి పిల్లలు మనకూ త్వరలో ..అంటూ నాని సంభాషణలు పలుకుతున్నట్లు పిక్‌లో నాని లుక్స్ ఉన్నాయని తమ మదిలోని మాటను నెట్టింట్లో పెట్టారు. అందులోనూ ఆ పోస్టర్స్‌లో ఉన్న సాయి పల్లవి లుక్స్ నెటిజన్ల ఊహకు దగ్గరగా ఉండటంతో నిజమేమో అనుకుంటున్నారు కామెంట్లు చదివిన వారంతా. మరి ఇది నిజమో.. కాదో సినిమా విడుదలైతే కానీ తెలియదు కదా..!