పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం చూపిస్తే.. చివరకు ప్రాణాలను దక్కించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభాగ్యురాలికి మరోసారి తేరుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించి ఆమె బాగోగులు చూడాల్సిన భర్త రాజేష్ తండ్రి కుమారస్వామి రెడ్డి వల్గర్‌గా మాట్లాడారు. ఐదు నిమిషాల సుఖం కోసం ఇంత రాద్దాంతం చేయడం అవసరమా. నా కొడుకు నపుంశకుడే.. నిన్ను చూసుకోవడానికి నేనున్నాగా.. ఎందుకింత రాద్దాంతమంటూ కోడలితో అసభ్యంగా మాట్లాడాడు మామ. కోడలు అంటే కుమార్తెతో సమానం. అలాంటి కోడలితో మామ మాట్లాడిన మాటలు విన్న బంధువులు ఆశ్చర్యపోయారు. కుమారస్వామి రెడ్డిని ఎంత వారించినా ఆయన మాత్రం మాట్లాడటం మానలేదు. ఈ ఘటనపై నన్నపనేని రాజకుమారి స్పందించారు. శైలజపై దాడి ఘటన దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. రాజేష్ తండ్రి కూడా శైలజతో దారుణంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మామను ఏం చేస్తారో చూడాలి.
