రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ఒక చారిత్రాత్మక సందర్భమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు . అయన ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019లో భారతదేశ ప్రధాన మంత్రి కావడం ఖాయమని అన్నారు . రాబోయే ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో కేంద్రంతో పాటు, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సెట్ల నామినేషన్ వేశామని, 30 మంది నాయకులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు.