నవంబర్ 6న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 26వ రోజు అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్ లో అడుగుపెట్టాడు. సాయంత్రం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…గడిచిన నాలుగెళ్లలో చంద్రబాబు పాలన చూశాం.. ఇంత దారుణంగా ఏవరైనా రాష్ట్రాన్ని పరిపాలించారని ప్రజలు అడిగాడు వైఎస్ జగన్ . అంతేగాక గుత్తిలో ఉండే…మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు..వారు ఏం చెప్పారంటే దాదాపుగా 6 నెలలు నుండి మాకు టీడీపీ ప్రభుత్వం జీతాలు ఇవ్వడంలేదని….ఇంతకన్నా దారుణం ఏముంటుంది వారికి జీతు ఇవ్వకపోతే వాళ్లు ఏలా బ్రతకాలి ,పిల్లలకు చదువులు ఏలా చెబుతారన్న జ్ఞానం కూడ చంద్రబాబుకి లేదు అన్నాడు జగన్.
మరోపక్క ..
గుత్తి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు నా వద్దకు వచ్చారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని అన్నారు. ఇదే గుత్తిలో ఉర్దూ స్కూల్ ఉంది.. మీ అందరికీ తెలుసు.. పిల్లలకు అన్నం వండే ఆయాలు వచ్చారు.. ఆరు నెలల నుంచి అన్నం వండుతున్నా తమకు డబ్బులు ఇవ్వట్లేదని అన్నారు. తమకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేవని చెబుతున్నారు.
ఈ చంద్రబాబు పాలనలో విచ్చలవిడి అవినీతి కనపడుతోంది. రాష్ట్రంలో దొంగల రాజ్యం ఉంది. గ్రామాల్లో రేషన్ బియ్యం కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అన్నా.. ఇదన్నా మా పరిస్థితి అని గుత్తి ప్రజలు బాధలు చెప్పారు. ఒక్కసారి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో గుర్తు తెచ్చుకోండి.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పండి” అని వ్యాఖ్యానించారు. దీంతో ఏపీ ప్రజలు ఆలోచిస్తూ జగన్ వాగ్దానాలు పేదవారి కడుపు నిండుతుంది. సుఖ సంతోషలతో ఉంటారు 2019లో జగన్ ను సీయంగా చేయలని అనుకుంటున్నట్లు సమచారం.