మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఒక్కరోజే రూ. 870 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదిలోగా జిల్లాలో ఇంటింటికి ప్రతీ రోజు మంచినీరు అందిస్తామన్నారు. జైపాల్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఏమీ చేయలేదని నిప్పులు చెరిగారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని ఉద్ఘాటించారు. మన ముఖ్యమంత్రి కేసిర్ కారణజన్ముడు అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు.
Addressing the public meeting at the Mahabubnagar Municipality. pic.twitter.com/TAxXPzaDwn
— V Srinivas Goud (@VSrinivasGoud) December 4, 2017