తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల వెంట ..సంబంధిత అధికారుల వెంట పడుతున్నాడు . నిత్యం పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే మంత్రి హరీష్ సోషల్ మీడియాలో కుడా చాలా ఆక్టివ్ గా ఉంటారు.. ఈ క్రమంలో ఇవాళ ఓ వాట్సప్ మేసేజ్‌కు స్పందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.
సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేటకు చెందిన రామచంద్రంగౌడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సిద్దిపేట దవాఖా నకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని గాంధీ దవా ఖానకు రెఫర్ చేశారు. గాంధీలో డాక్టర్లు పట్టించుకోకపోవడంతో రామచంద్రంగౌడ్ అల్లుడు మహేశ్‌గౌడ్.. మంత్రి హరీశ్‌రావు ఫోన్‌కు వాట్సప్ ద్వారా సమస్యను తెలియజేశాడు. వెంటనే స్పందించిన మంత్రి.. పీఏ వెంకటేశ్వర్లును గాంధీ దవాఖానకు పంపించి చికిత్స జరిగేలా చూడాలని ఆదేశించారు. దీంతో డాక్టర్లు అతడికి మెరుగైన వైద్యచికిత్స చేశారు. ప్రజలే కుటుంబం అనుకొని పనిచేసే ప్రజానేత హరీశ్‌రావు అని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.