ఇవాళ మహబూబ్ నగర్ జిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు . జిల్లాలో పలు అభివ్రద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మున్సిపాలిటీ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసారు .. ఈ సందర్బంగా బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ళు అధికారం ఇస్తే చేసిందేమీ లేదన్నారు .కొలవుల కొట్లాట మీ కోసమా ..? జైపాల్ రెడ్డి కొలవు కోసమా.. లేదా జానారెడ్డి కొలవు కోసమా అని ప్రశ్నించారు .. కొలవుల కొట్లాట ఎవరి కోసం అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.
ఓ రిటైర్ ప్రొఫెసర్ ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శిఖండి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్సే అని ఆగ్రహం వ్యక్తం చేసారు .ముసలి కన్నీరు కారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈ రోజు ఇష్ట మచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎనాడైన కలిసి వచ్చారా అని మంత్రి కేటీఆర్ అడిగారు .తమ బాసులు ఢిల్లీలో లేరు.. తెలంగాణ గల్లీలో ఉన్నారని పేర్కొన్నారు.
పాలమూరు జిల్లా పచ్చబడుతున్నది. వచ్చే ఎండాకాలం నాటికి మహబూబ్‌నగర్‌లో ఇంటింటికి ప్రతీ రోజు నీరిస్తాం. గతంలో పాలమూరు దేశంలోనే వెనుకబడిన జిల్లా. కానీ ఇప్పుడు పాలమూరు జిల్లా దశ మారింది. వలస పోయినోళ్లు జిల్లాకు తిరిగి వస్తున్నారని తెలిపారు. పాలమూరు ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న సోయిలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.టీఆర్ఎస్ పార్టీ కి 60 నెలల అధికారం ఇచ్చారు..ఆనాటి వరకు లక్షా పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామనిఏ సందర్బంగా మంత్రి హామీ ఇచ్చారు . ఫార్మాసిటీ భూసేకరణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని అన్నారు . ఫార్మాసిటీతో పాలమూరు, రంగారెడ్డి యువతకు లక్ష ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేసారు .
Minister @KTRTRS addressed a mammoth public meeting held at Mahabubnagar today. pic.twitter.com/UPTHboxsON
— Min IT, Telangana (@MinIT_Telangana) December 4, 2017