తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న మంత్రి .. ఆస్ట్రేలియాలో నిర్వహించిన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం, కల్చరల్ సమావేశానికి నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం నిపుణులైన మానవ వనరులు, అంతరాయం లేని విద్యుత్తు, నీటి సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాపారవేత్తలు హైదరాబాదద్ లో పెట్టుబడులు పెట్టాలని నాయిని కోరారు.
