రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలిచిన కొత్తపల్లి గీత మూడు నెలలు తిరక్కముందే అధికార టీడీపీలో చేరారు .
తాజాగా ఆమె టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలో ఇటీవల అరకు లో టీడీపీ సర్కారు ఎంతో అట్ట హాసంగా జరిగిన బెలూన్ ఫెస్టివల్ కి స్థానిక ఎంపీ అయిన కొత్తపల్లి గీతకు ఆహ్వానం అందలేదు .
అంతే కాకుండా విశాఖపట్టణంలో జరిగిన బిల్ గేట్స్ హాజరైన అగ్రిహాక్ థాన్ సదస్సుకు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఆమె మాట్లాడుతూ టీడీపీలో మహిళకు కనీసం మర్యాద ఇవ్వడంలేదు ..ఎంపీ గా కూడా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ఎవరు గుర్తించడంలేదు .మహిళకు సరైన గౌరవం దక్కడంలేదని ఆమె వాపోయారు ..