అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క. అనుష్క లెగ్ మహిమో.. మరేమోగాని.. ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాలను సైతం వదులుకుంది ఈ స్వీటి.
అంతేకాదు, ఒకప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజయశాంతేనని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుష్క సొతం. అంతలా తన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అనుష్క. అనుష్క నటించిన అరుంధతి, రుద్రమదేవి సినిమాలే అందుకు ఉదాహరణ. అంతేకాదు అపజయం ఎరుగని ప్రముఖ దర్శకుడు రాజమౌళికి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది అనుష్క. అందులో భాగంగానే జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రంలో అనుష్కకు ఓ కీలక రోల్ కూడా ఇచ్చాడు. ఆ సినిమా అనుష్క క్రేజ్‌ను ఓ స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు. అంతకు ముందు రాజమౌళి దర్శకుడిగా.. రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాల్లో హీరోయిన్ రోల్ చేసింది అనుష్క.
అంతేకాదు. వయసు పెరుగుతున్నా.. అవకాశాలు చేజిక్కించుకోవడంలో అనుష్క దిట్టేనని అంటున్నారు సినీ జనాలు. దీనికి కారణం..అనుష్క ఫిట్‌నెస్సే అట. వయసు పెరిగినా గ్లామర్‌ను ఎలా కాపాడుకోవాలో తెలిసిన సుందరి ఈ స్వీటి. మూడు పదుల వయసులో కూడా తన డిమాండ్ ఇంకా ఏమీ తగ్గలేదని నిరూపిస్తోంది. క్యారెక్టర్ ఏదైనా ఒదిగిపోయి మరీ చేయగల సత్తా అనుష్కది.
అయితే, తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తనలోని మరో క్యారెక్టర్‌ని బయటపెట్టింది. నేను ఏనాడూ సినిమా ఇండస్ర్టీలో స్థిరపడతానని అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో ఇప్పటి వరకు వదులుకుంది ఏమీ లేదు.. అందుకే బాహుబలి చిత్రం షూటింగ్ పూర్తయ్యాక చాలా రోజులు విశ్రాంతి తీసుకున్నా… అప్పుడు జీవితంలో విరామానికి, పనికి ఎంత విలువ ఉందో తెలుసుకున్నానని, అలాగే, అయితే, తాను ఏ పనిచేసినా.. వ్యక్తిగత ఆనందాలు కోల్పోకుండా చూస్తానంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క.