Home / CRIME / నాలుగు రోజుల కిందటే పూడ్చిపెట్టడానికి గుంత తవ్విన దుర్మార్గుడు

నాలుగు రోజుల కిందటే పూడ్చిపెట్టడానికి గుంత తవ్విన దుర్మార్గుడు

వివాహమై విడాకులు తీసుకున్న యువతిని మోసం చేయడంతో పాటు పెళ్లికి ఒత్తిడి చేయడంతో దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్ జిల్లా డోన్‌ లోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్‌ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రమిజ భర్త చనిపోగా ఆరేళ్ల కుమారుడితో ఉంటోంది. సిద్ధూతో పరిచయమైన తర్వాత ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో సిద్ధూ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 20న నంద్యాలకు వెళ్లి అక్కడ కాపురం పెడదామని రమిజను నమ్మించి బేతంచర్ల బస్సు ఎక్కించాడు. డోన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బస్సు దింపాడు. రైల్వే వంతెన సమీపంలో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమె గొంతు వెనుక నుంచి తాడుతో బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. హత్య పథకంలో భాగంగా నాలుగు రోజుల కిందటే ఆ ప్రాంతంలో తాను తవ్విన గుంతలో పూడ్చిపెట్టాడు. తన కూతురు కనపించటం లేదని తల్లి లక్ష్మీదేవి గత నెల 27న డోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిద్ధూను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా హత్య చేశానని అంగీకరించాడు. నిందితుడిని ఆదివారం సంఘటనా స్థలానికి తీసువెళ్లిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.
హత్య స్థలంలో అతను చంపడానికి ఉపయోగించిన నైలాన్‌ తాడు, మృతురాలి దుస్తులు, గొయ్యి తవ్వే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కర్నూలు న్యాయస్థానానికి తరలించారు. హత్య చేయడానికి నిందితుడి బంధువులు సహకరించి ఉంటారని, ఆ కోణంలోనూ విచారించాలని మృతురాలి తల్లి లక్ష్మీదేవి కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat