తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంగా తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినేట్ సబ్ కమిటీ ని నియమించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్రావు, చందులాల్ కొనసాగనున్నారు. సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియానికి చేరుకుని తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలించారు.మహాసభలకు వచ్చే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ వెంబడి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు అధికారులు ఉన్నారు.
