ప్రముఖ దర్శకుడు తేజ, నితిన్ కాంబోలో తెరకెక్కిన జయం చిత్రంలో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సదా. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ తన పాస్‌పోర్టులో ఉన్న సదాహ్ మహ్మద్ సయ్యద్ అనే తన పేరులోని మొదటి రెండు అక్షరాల పేరుతో ఇండస్ర్టీలో సెటిలైంది. అయితే, వెళ్లవయ్యా వెళ్లూ.. అంటూ జయం సినిమాలోని తన డైలాగ్‌తో ఫేమస్ అయిన ఈ భామకు కెరియర్ ప్రారంభంలో మంచి అవకాశాలే వచ్చినప్పటికీ తరువాత డల్ అయింది. అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ వంటి చిత్రం వచ్చినా కూడా ఈ భామకు అవకాశాలు తలుపు తట్టలేదు. అప్పటికీ స్టార్ హీరోలతోనూ నటించింది.. అయినా.. అదే పరిస్థితి.
వెండితెర అవకాశాలు లేకపోతేనేం.. బుల్లితెర ఉంది కదా..! అంటూ ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తోంది ఈ భామ. అయితే, తాజాగా ఈ భామను కోలీవుడ్ పిలిచింది. తమిళంలో టార్చ్‌లైట్ అనే టైటిల్‌పై తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సదా వేశ్య పాత్రలో నటించడం మరో విశేషం.
దీంతో, ఈ మధ్యకాలంలో వేశ్య పాత్ర అంటే చాలు సందేహించకుండా చేసేస్తున్న హీరోయిన్ల జాబితాలో ఈ మహారాష్ట్ర బ్యూటీ కూడా చేరిపోయింది. ఇప్పటికే ఆ జాబితాలో అనుష్క, ఛార్మి, శ్రేయ ఉండగా.. తాజాగా సదా కూడా చేరింది. ఇటీవల టార్చ్‌లైట్ చిత్ర బృందం సదా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మొదట, ఈ సినిమాల తమిళంతోపాటు.. తెలుగులో కూడా ఉంటుందని చెప్పారు. అయితే, తమిళంలోనే ఫస్ట్ లుక్ విడుల చేయడంతో తెలుగులో టార్చ్‌లైట్ విడుదల ఉంటుందా..? ఉండదా..? అన్న ప్రశ్నలకు చిత్ర బృందమే చెప్పాలి. ఉండుంటా ఉండదా అనే లిఎయాల్సి ఉంది.