ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భేటీపై ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు కథనాల ప్రచురణ కేసులో ఆయనకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టుకు హాజరుకాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలన్న క్యాష్ పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీంతో డిసెంబర్ 5న రాధాకృష్ణ నాంపల్లి కోర్టు హజరు కావల్సిందేనని న్యాయమూర్తి తెలిపాడు. అంతేగాక రాధాకృష్ణతో పాటు ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మరో ఆరుగురు కోర్టుకు హాజరుకావలని ఆదేశాలు జారి చేశారు.
అసలేం జరిగిందంటే..
కొన్ని నెలల క్రితం జగన్.. ప్రధాని మోడీని కలిశారు. పోలవరం, ప్రత్యేక హోదా, రైతు సమస్యలపై మోడీకి వినతిపత్రం ఇచ్చారు. జగన్, మోడీ భేటీకి సంబంధించి అప్పట్లో పీఎంవో కూడా ఒక నోట్ విడుదల చేసింది. అయితే దాన్ని పట్టించుకోని రాధాకృష్ణ తన పత్రికలో వాస్తవ విరుద్దమైన కథనాన్ని ప్రచురించారు. తన పత్రికలో కేసుల మాఫీ కోసమే ప్రధానిని జగన్ కలిశారని…. కాళ్లు పట్టుకున్నారంటూ కాస్త అభ్యంతరకరంగా కథనాలు రాసి జగన్ మీద తన అక్కసు వెళ్లగక్కారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాధాకృష్ణ పత్రికపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు.రామకృష్ణారెడ్డి దావాను స్వీకరించిన కోర్టు.. తన ఎదుట హాజరుకావాల్సిందిగా రాధాకృష్ణకు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన కోర్టుకు హాజరు కాలేదు. పైగా పొంతన లేని సమాధానాన్ని తన లాయర్ ద్వారా పంపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని…. అందువల్ల బీజీగా ఉన్న రాధాకృష్ణ కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని ఆయన తరపున న్యాయవాది గతంలో కోర్టుకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. రాధాకృష్ణకు, అసెంబ్లీ సమావేశాలకు ఏం సంబంధమని ప్రశ్నించింది.రాధాకృష్ణ ఏమైనా ఎమ్మెల్యేనా అని కోర్టు నిలదీసింది . డిసెంబర్ 5న నిందితులంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో తాను కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలంటూ హైకోర్టులో రాధాకృష్ణ క్యాష్ పిటిషన్ వేశారు. కానీ డిసెంబర్5న కోర్టుకు హాజరు మినహాయింపుకు హైకోర్టు అంగీకరించలేదు. దీంతో వేమూరి రాధాకృష్ణ కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Tags alla ramakrishna reddy andrajyothi court vemuri radhakrishna