Home / CRIME / శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్యలో కొత్త షాకింగ్‌ ట్విస్ట్‌

శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్యలో కొత్త షాకింగ్‌ ట్విస్ట్‌

గత ఫిబ్రవరిలో అమెరికాలోని తెలుగు ఇంజినీర్‌ హత్య ఉదంతం కొత్త మ‌లుపు తిరిగింది. అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల(32) హత్యకేసులో నిందితుడు ఆడం ప్యూరింటన్‌(52) తాను తప్పు చేశానన్న భావనను వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్‌ పట్టణంలోని ఒక బార్‌లో ప్యూరింటన్‌ అనే మాజీ నేవీ ఉద్యోగి శ్రీనివాస్‌ను జాతిపరమైన వివక్షతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణ శుక్రవారం జరిగింది. అయితే తాను ఎలాంటి నేరం చేయలేదని ప్యూరింటన్‌ చెప్పినట్లు కోర్టులో నమోదైంది.

విదేశీయులు అమెరికాలోని ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారన్న జాతివిద్వేష ప్రచారంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడుగా ఎన్నికైన కొత్తలో అమెరికాలో భారతీయులపై పలు చోట్ల దాడులు జరిగాయి.‘మీరు మా దేశం నుంచి వెళ్లిపోండి’ అని అరుస్తూ ప్యూరింటన్‌ గొడవకు దిగి శ్రీనివాస్‌ను తుపాకీతో కాల్పి చంపాడు. ఈ సందర్భంగా అలోక్‌ మేడసాని అనే మరో భారతీయ యువకుడిని కూడా హత్య చేయాలని చూశాడని, ఈ దాడిని అడ్డుకోబోయిన ఒక శ్వేతజాతీయుడిని కూడా గాయపరిచాడని కేసు విచారణ సందర్భంగా  ఫెడరల్‌  ప్రాసిక్యూటర్లు కోర్డుకు తెలిపారు.

కాల్పులు జరిపిన తరువాత ప్యూరింటన్‌ అక్కడికి 70 కిలోమీటరక్ల దూరంలో ఉన్న  మిస్సోరీలోని ఆపిల్‌బీ రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి బార్‌టెండర్‌కు తాను చేసిన దాడి గురించి చెప్పాడు. ప్యూరింటన్‌పై ఉద్దేశ పూర్వక దాడి, హత్య, హత్యాయత్నం అభియోగాలు దాఖలయ్యాయి. అభియోగాలు రుజువైతే ప్యూరింటన్‌కు మరణశిక్ష లేదా, జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది మే8కి వాయిదా పడింది. శ్రీనివాస్‌ అమెరికాలోని గార్మిన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat