పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.. పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని ..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలి కానీ ఆయన కేంద్రం కాళ్ళు మొక్కుతున్నాడు.. ఓటు నోటులా బాబు ఏదో విషయంలో మోదీకి సరెండర్ అయ్యాడని ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఇక అంతటితో ఆగని ఈ సీనియర్ నేత.. కేంద్రం పై , ముఖ్యంగా మోడీ, అమిత్ షా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ, అమిత్ షా హిస్టరీ చాలా భయంకరమైనది అని, వారికి అడ్డు వస్తే, చంపెయ్యటానికి కూడా వెనకాడరని అది చరిత్ర అని ఉండవల్లి అన్నారు.
ఆ కాషాయం బ్యాచ్ భయంతోనే చాలా మంది సరెండర్ అవుతున్నారు అని అన్నారు… ఈ ఇద్దరి చరిత్రే అది అని అన్నారు… చంద్రబాబు ఇలా చంపేస్తారని భయపడుతున్నారా, లేక కేసులు వేసి ఇబ్బంది పెడతారానికి అని భయపడుతున్నారా అంటూ, ఉండవల్లి చంద్రబాబుని జాగ్రత్తగా ఉండమన్నారు. బీజేపి హిందూ ఎజెండా కోసం, ఎలా చేస్తున్నారో చూస్తున్నామని అని అన్నారు.. బీజేపీ పార్టీ ఫిలాసఫీ కంటే, మోడీ, అమిత్ షా ఫిలాసఫీ చాలా భయంకరమైనది అని అన్నారు. వీరంతా అధికారంలో కొనసాగటమే వారి ఏకైక ఎజెండా అని, దాని కోసం ఏమైనా చేస్తారని, అవసరమైతే అడ్డు అనుకుంటే, చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.