డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరోసినీ నటుడు దొరికాడు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో తెలుగు సినీ హాస్యనటుడు నవీన్ అడ్డంగా దొరికాడు. తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ.. మీడియాను చూసి భయంతో పారిపోతూ.. కారు కింద నక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే నవీన్‌ని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు అతని కారును సీజ్ చేసి అతని పై కేసు బుక్ చేశారు.
ఇక పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టిన యువతులు ఖరీదైన కార్లను నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. సైనిక్ పురికి చెందిన సంజన అనే యువతి ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేయసాగింది. సంజనకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా.. 93శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ నమోదైంది. మారి అనే మరో యువతిని పరీక్షించగా.. 89 శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నట్టు నిర్థారణ అయింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 20 మంది పై కేసులు బుక్ చేసి.. 14 కార్లు, 6 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో ముందు వెళ్తున్న కారును అతివేగంతో ఢీకొట్టారు బీటెక్ విద్యార్థులు. అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న జతిన్ వర్మ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మిత్రులు నిఖిల్, కార్తీక్, రోహణ్ తీవ్రంగా గాయపడ్డారు. మద్యం తాగిన మైకంలో అజాగ్రత్తతో కారు నడపడటమే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు తెల్పారు.