Home / SLIDER / 2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు..మంత్రి హరీష్

2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఈ-సేవ శిక్షణ తరగతులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..

Image may contain: 3 people, people standing

ఈ-నామ్‌పై అవగాహన పెంపొందించేందుకు, అమలు చేసేందుకు శిక్షణ తరగతులను ప్రారంభించామన్నారు. ఈ-సేవ శిక్షణ తరగతులు ఆరు రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు.ఈ-నామ్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పోతుందని తెలిపారు. 2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు జరగాలని అధికారులను ఆదేశించారు.దేశ వ్యాప్తంగా ఈ-నామ్ ద్వారా రైతులకు పోటీతత్వం పెరగాలన్నారు. ఇప్పటికే 46 మార్కెట్‌లలో ఈ-నామ్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ-నామ్ ద్వారా అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ-నామ్ ఉపయోగించుకోవడంలో నిజామాబాద్ మార్కెట్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. మార్కెటింగ్ శాఖకు సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయించారని తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రతీ మండలానికి ఒక గోదాంను నిర్మించినట్లు చెప్పారు. మార్కెటింగ్ శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Image may contain: 6 people, people smiling, people standing

Image may contain: 8 people, people smiling, people standing and outdoor

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat