వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్‌కు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు గుత్తిలో ప్రారంభమవుతోంది. సాయంత్రం 4 గంటలకు గుత్తిలోని గాంధీ చౌక్‌లో బహిరంగ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ గుత్తిలోనే బస చేస్తారు.
