భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఇవాళ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి ఆశీస్సులు పొదారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ…రాబోయే సంవత్సరంలో టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రికెట్ జట్టుపై స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ వుండాలని ప్రార్థించానన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
