తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో ప్రస్తుతం వివాదాల మధ్య నడుస్తోంది. జబర్దస్త్‌లో ఆనాధలు, మహిళలు, హిజ్రాల గురించి తమకి నచ్చినట్టు పంచ్‌లు వేస్తున్నారని కొన్ని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. వల్గర్ కామెడీకి వేదికగా, వివిధ వర్గాలు, ఆనాధలు, మహిళలు కించపరిచేందుకే వేదికగా జబర్దస్త్ షో మారిందని అటు మానవ హక్కుల కమిషన్ లోను ఇటు సైబరాబాద్ స్టేషన్‌లోను ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనిపై ఇప్పటికే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. జబర్దస్త్ లోని కమెడియన్ హైపర్ ఆదిపై ప్రజా సంఘాలన్నీ మండిపడుతున్నాయి.
అయితే దీనిపై జబర్దస్త్ ప్రోగ్రాంకి జడ్జి గా వ్యవహరిస్తున్న నాగబాబును వివరణ కోరేందుకు కొన్ని ప్రజాసంఘాలు ప్రయత్నించారు.దీంతో చిర్రెత్తిపోయిన నాగబాబు ఫోన్‌లోనే ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. మీడియా, ప్రజా, మహిళా సంఘాలు మీరెవరు ఉద్దరించడానికని ప్రశ్నించారు. మీలాంటి వారు చేసే తప్పుడు ఆరోపణలకు నేను స్పందించాల్సిన అవసరం లేదు. ఏది కామెడీ, ఏది బూతు అన్న విషయాన్ని నిర్ధారించాల్సింది మీలాంటి సంఘాలు కాదని.. ప్రేక్షకులు మాత్రమే డిసైడ్ చేయాలని నాగబాబు ఫైర్ అయ్యారట. దీనిపై ఎక్కువ రచ్చ చెయ్యొద్దని చెప్పి ఫోన్ కూడా పెట్టేశారు. ఇప్పుడు నాగబాబు తీరుపై ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.