లక్షకు లోపు కొలువులు ఇంకా ఒక సంవత్సరం లోపే ప్రభుత్వం ఇస్తామంటుంది కదా అయినా ఆగకుండా ఎందుకింత షో చేస్తుండ్రు? మీ లెక్క చుస్తే వచ్చే ఎన్నికల తర్వాత మీ కొలువుల కొరకు చేస్తున్నట్లుంది. ప్రతి పక్షాలను చుస్తే బాధ వేస్తుంది,సరైన దిశలో పోరాటం చేపించే నాయకుడు కరువైండు.ప్రతిపక్షాలు పోరాడడం లో తప్పు లేదు కానీ సరైన సమస్యని ఎంచుకొని చేస్తే బాగావుంటది. ఈ మూడు ఏండ్ల లో జరుగుతున్న అభివృద్ధి పనులు రైతులకు ఇరవైనాలుగు గంటల కరెంటు ,కాకతీయ చెరువులు,వేగంగా జరుగుతున్న కాళేశ్వరం మరియు మిషన్ భగీరథ పనులు,కెసిఆర్ కిట్లు,కల్యాణలక్ష్మి చెక్కులు,నూటపంతొమిది గురుకులాలు,వేగంగా హైదరాబాద్ మెట్రో లాంచ్ ఇంకా చెప్పుకుంటే పోతే చాంతాడంత ఒక్క పనిని అన్న ప్రతిపక్షాలు మెచ్చుకున్నాయా?
ప్రజలు అన్ని గమనిస్తారు వాళ్లకు అన్ని తెలుసు. ప్రజలకు ఒక విన్నపము ఈ కొలువుల కొట్లాట లొల్లి పటించుకొని ఆగం కాకుర్రి,ఇట్లా గత పదిహేను ఏండ్ల కెళ్ళి కేసీఆర్ గారికి వ్యతిరేకకంగా చేస్తనే ఉన్నారు.తెలంగాణ వచ్చేవరకు మనం కెసిఆర్ గారి వెనుక ఎలా ఉన్నామో అలానే బంగారు తెలంగాణ అయ్యే వరకు అలానే ఉందాం.ఇక నుండి మనమంతా మనకొరకు మన ఫ్యూచర్ కొరకు ఏకతాటి పై ఉండి కెసిఆర్ గారి నాయకత్వం బలపరుచుదాం ఎందుకంటే కెసిఆర్ గారు మరియు తెరాస ప్రభత్వం తోటే బంగారు తెలంగాణ సాధ్యం అవుతది.
-శ్యామ్ బాబు ఆకుల, ప్రెసిడెంట్ ,తెరాస డెన్మార్క్.