అమెరికా టెకీలకు తీపికబురు. హెచ్ 1 బీ వీసా జారీ విధానంలో ఎలాంటి మార్పులూ తీసుకొనిరాలేదని, పాత విధానమే అమలవుతుందని అమెరికా స్పష్టంచేసింది. హెచ్ 1 బీ వీసా జారీ విధానంలో మార్పుల కోసం ఉద్దేశించిన బిల్లు ఇంకా చట్టసభలో పాస్ కాలేదని దక్షిణాసియాకు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ స్టేట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న థామస్‌వాజ్దా పేర్కొన్నారు. దీంతో టెక్‌వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొనేందుకు కోల్‌కతా వచ్చిన థామస్‌వాజ్దా మీడియాతో మాట్లాడారు. హెచ్ 1 బీ వీసాల జారీపై సమీక్ష జరుపాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారనీ, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ప్రస్తుత వీసాల విధానం మార్చాలంటే చట్టంలో అనేక మార్పులు తీసుకొనిరావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పాత విధానంలోనే వీసాలు జారీచేస్తున్నట్టు -అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ స్టేట్ సెక్రటరీ థామస్‌వాజ్దా స్పష్టంచేశారు.
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023