ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏన్ని హామీలు ఇచ్చాడో అందరికి తెలిసిందే…అందులో ఒకటి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికి కూడ ఇవ్వలేదు. గడిచిన రోజుల్లో ఇవ్వలేదుగాని ఇంక ఒకటిన్నర సంవత్సరంలో 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాడో ఆయనకే తెలియాలి మరి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పడంతో యువత ఆలోచనలో పడ్డారు.
అంటే 2019 ఎన్నికల్లో గెలిపిస్తే 15 లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట అని. అంతేకదా మరి వచ్చే మూడేళ్లలో అంటే 2019 ఎన్నికల తరువాతే కదా. ఇంకో మాట రాష్ట్రంలో మూడేళ్లో ఐదు లక్షల ముప్పైఐదువేల ఉద్యోగాలు వచ్చాయని కూడా ఆయన చెప్పడం విశేషం. దీనిపై వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశానికి యువతే ఆదర్శం..అలాంటి యువతకు ఉద్యోగాలు ఇస్తానని ఆశ చూపి మోసం చెయ్యడం దారుణం అంటున్నారు