రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో అచ్చంపేటలో కాంగ్రెస్ ప్రజాగర్జన బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జైపాల్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, డికే అరుణ, సంపత్, వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…టీఆర్‌ఎస్ బీసీలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. సభ విజయవంతం కాకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆయన మండిపడ్డారు. జేఏసీ కొలువుల కొట్లాట సభకు భారీగా తరలిరావాలి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
