కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రానికి రహస్యంగా లేఖలు రాసిన ప్రతి పక్షనేత జగన్ను రాళ్లతో కొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలే ఖరులతో మాట్లాడుతూ జగన్ ఓ పదవి పిచ్చోడని, సీఎం కుర్చీ కోసం పాదయాత్ర చేస్తూ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను పందులతో పోల్చిన జగన్ వారిని గెలిపించిన ప్రజలందరినీ అవమానించారన్నారు. ఎమ్మెల్యేలు పంది కొక్కులు అయితే వారికి టికెట్టు ఇచ్చిన జగన్ పెద్ద పందికొక్కని మండిపడ్డారు. జగన్కు బీసీలంటే ఏ మాత్రం గౌరవం లేదని, పాదయాత్రలో వారి గురించి ఎక్కడా మాట్లాడటం లేదని విమర్శించారు. జగన్ ఎన్నటికీ సీఎం కాలేరని, 2019 ఎన్నికల్లో ఆయనకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. మరో పక్క జగన్ పాదయాత్ర చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక ఇలా పిచ్చిగా మాట్లుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు
