లావయ్యావని ఓ మహిళను భర్త నిరాకరించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు శుక్రవారం మహిళ సంఘాలతో అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు రాజచంద్ర డెలాయిట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 2015లో నవంబర్‌లో ఉప్పల్‌కు చెందిన రంగయ్య, అనిత దంపతుల కుమార్తె అమూల్యతో వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నెలల నుంచి అత్త, తన భర్త వేధిస్తున్నారని అమూల్య ఆరోపించింది. తనకు కళ్లద్దాలు ఉన్నాయని, లావుగా ఉన్నావని వేధిస్తున్నాడని, అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ఎదుట ఆందోళన కొనసాగిస్తానని పేర్కొ ంది. అమూల్య భర్తపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతుంది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఆందోళన చేయడం సరికాదని అమూల్యకు నచ్చచెప్పారు. కోర్టు ద్వారా లేదా మధ్య వర్తుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు.