బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రశంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే దాస్యం మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర సీఎం కేసీఆర్, సీఎం కేసీఆర్ కు బీసీలు అండగా నిలుస్తున్నారని, భవిష్యత్ లో కూడా అండగా ఉంటారని ధీమా వ్యక్తమవుతుందన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను బీసీలు అందిపుచ్చుకోవాలని అన్నారు. గతంలో బీసీలకు కేసీఆర్ తరహాలో పథకాలు పెట్టిన సందర్భం లేదని అన్నారు. కేసీఆర్ వినూత్న ఆలోచనలు బీసీల పురోగమనానికి తోడ్పడుతాయని అన్నారు. కులవృత్తులకు మంచి రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ అండతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ప్రకటించారు.
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ బీసీల కోసం ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి బీసీల సంక్షేమం గురించి కేసీఆర్ లా ఆలోచించ లేదన్నారు. సీఎం కేసీఆర్ రేపు బీసీ ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశం వెనకబడిన వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోందని తెలిపారు. బీసీల కోసం అద్భుతమైన పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ను అభినందించేందుకు త్వరలో లక్షలాది మందితో హైదరాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.