Home / MOVIES / ‘అంత సీను లేదు’.. నంద‌మూరి హీరోపై నిర్మాత సంచ‌ల‌న కామెంట్‌

‘అంత సీను లేదు’.. నంద‌మూరి హీరోపై నిర్మాత సంచ‌ల‌న కామెంట్‌

త‌మ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత మరియు దర్శకులు. అంతేకాదు. వారి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండ‌స్ర్టీలోనే ఉంది. ఆయ‌న తండ్రి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి. తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ నిర్మాత‌గా ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగా ఫ్యామిలీకి బాగా ద‌గ్గ‌రైన దర్శ‌కుల్లో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఒక‌రు. అంతేకాదు, బాలీవుడ్‌లో ముక్కుసూటి మాట్లాడే కంగ‌నా ర‌నౌత్‌లానే ఈయ‌నా టాలీవుడ్‌లో ముక్కుసూటిగా మాట్లాడ‌తార‌ని అంటుంటారు వెండితెర‌ జ‌నాలు.

అప్పుడ‌ప్పుడు సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తాజాగా.. బాల‌కృష్ణ‌పై చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైర‌ల్ అయింది. అయితే, ఇటీవ‌ల సాయి ధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన జ‌వాన్ చిత్రం విడుద‌లై మంచి క‌లెక్షన్స్‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న చిత్రం ప్ర‌మోష‌న్స్ కోసం మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చే ప‌నిలో ఉన్నారు. అందులో భాగంగానే త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు కూడా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చేశాడు ఈ మెగా మేన‌ల్లుడు.

ఇంట‌ర్వ్యూలోభాగంగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ హీరోల ఓవ‌ర్సీస్ మార్కెట్‌పై మాట్లాడుతూ.. నిన్నే పెళ్లాడ‌తా సినిమాతో ఓవ‌ర్సీస్ మార్కెట్ స్టార్ట్ చేసింది నేనే.. నేను 50 సినిమాలు చేసిన త‌రువాత చాలా మంది ఓవ‌ర్సీస్ మార్కెట్‌కు వ‌చ్చారు. అప్పుడు మీబోటోళ్లు చేసిన సినిమాలు ఓవ‌ర్సీలో రిలీజ్ చేసేవాళ్ల‌ము కాద‌ని అన్నారు. ఒక వేళ రిలీజ్ చేయాల్సి వ‌స్తే చిరంజీవి, నాగార్జు, వెంక‌టేష్ వంటి స్టార్ హీరోల సినిమాల‌నే రిలీజ్ చేసేవాళ్ల‌మ‌ని తెలిపారు. మ‌ధ్య‌లో మాట క‌లిపిన సాయి ధ‌ర‌మ్‌తేజ్ మ‌రి బాల‌కృష్ణ గారి సినిమాలు అంటూ అడుగ‌గా.. అప్ప‌ట్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఓవ‌ర్సీస్‌లో అంత మార్కెట్ ఉండేది కాదంటూ రిప్లై ఇచ్చాడు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat