మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు …శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వారికి కుటుంబసభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. తొలిరాత్రే… ఆ వధువుకు చేదు అనుభవాన్ని చవిచూసింది. పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న పెళ్లి కూతరు, రాత్రి 11.30 గ౦టలకు తిరిగి బయటకు రావడ౦తో బ౦ధువులు నచ్చచెప్పి లోపలికి ప౦పారు. ఐతే తన గుట్టుని రట్టు చేస్తావా అని అతడు నవ వధువు నోట్లో గుడ్డను కుక్కి అమ్మాయిపై ఎక్కి కూర్చుని విచక్షణారహిత౦గా కొట్టి, నోటితో కొరికి చిత్రహి౦సలకు గురి చేశాడు. బాధకు తాళలేక నవవధువు కేకలు పెట్టి, బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. శైలజ తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా బి.కోటలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్న రాజేష్‌కు..శైలజ తల్లిదండ్రులు సుమారు కోటి రూపాయల కట్నం ఇచ్చినట్లు సమాచారం. తనపై జరిగిన దారుణ ఘటనను తలచుకుని శైలజ భయంతో వణికిపోతోంది. కావాలనే రాజేష్ తనపై దాడి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది