పంచె కట్టి పల్లెటూరోడులా కనిపించినా.. .. షర్ట్ కాలర్ పైకి లేపి మాస్‌గా కనిపించినా.. భక్తిభావ సినిమాల్లో నటించినా టాలీవుడ్ కింగ్ నాగార్జున అందమే వేరు. బహుషా అందుకేనేమో నాగార్జున టాలీవుడ్ మన్మధుడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంటారు సినీ జనాలు. అయితే, ఇటీవల కాలంలో తన రెండవ కుమారుడు అఖిల్ హీరోగా తేరంగ్రేటం చేసినప్పటికీ మొదట్లోనే ప్లాప్ ఎదురవడంతో.. ఈ సారి ఎలాగైనా అఖిల్‌కు మంచి హిట్ ఇవ్వాలని కసితో ఉన్నాడు నాగార్జున. అందుకు తగ్గట్టే పెద్ద పెద్ద కసరత్తులే చేశాడు నాగార్జు. అందులో నుంచి వచ్చిందే. అఖిల్ నటించిన హలో చిత్రం.
అయితే, ప్రస్తుతం అఖిల్ నటించిన హలో మూవీ చిత్రం టీజర్ రిలీజై అందర్నీ ఆకట్టుకుంటోంది. దీంతో ఫుల్ ఖుసీలో ఉంది ఆ చిత్ర యూనిట్. ట్రయిలర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆసక్తికర సన్నివేశాలతో నింపేశాడు దర్శకుడు. దీంతో సగటు ప్రేక్షకుడిలో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ హలో మూవీ టీజర్ బాగుందంటూ పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలను కూడా తెలిపారు. వీళ్లలో ఎస్ఎస్ కార్తికేయ ఒకడు. టీజర్ తో అందర్నీ థ్రిల్ కు గురిచేసిన విక్రమ్ కుమార్ టీం, ట్రయిలర్ లో కూడా అలాంటి ఎన్నో మెరుపులు సిద్ధంచేసిందని ట్వీట్ చేశాడు కార్తికేయ.
ముఖ్యంగా ఈ ట్రైలర్ ప్రారంభంలో నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది. అయితే, హలో అంటూ ప్రారంభమైన నాగార్జున మాటలు. ఈ అబ్బాయి పేరు అవినాష్… ఒకప్పుడు ఇతన్ని శీను అని పిలిచేవారు.. ఎవరూ లేని శీను లైఫ్‌లోకి అనుకోకుండా తన సోల్‌మేట్ వచ్చింది.. అది అతనికి తెలిసేలోపే దూరమైపోయారు… అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే దేవుడికి బోరు కొట్టేయదు… అవినాష్‌గా మారినశీనుకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్… అనుకోని సంఘటనలు ఇతని లైఫ్‌ను ఎలా మార్చబోతున్నాయో అంటూ తన వాయిస్ ఓవర్ ఇచ్చాడు నాగార్జు. నాగార్జున వాయిస్ ఓవర్ అయిపోగానే… అఖిల్ హలో మళ్లీ తన యాక్షన్స్ సీన్స్‌ను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోన్‌లో ఉంది.