మెట్రోరైలు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే చార్జీలు కూడా ముందుగానే ఖరారు అయ్యాయి. దీంతో పాటు రైళ్ల రాకపోకల సమయాలను కూడా తెలిపింది.మెట్రోరైలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు నాగోలు, మియాపూర్, అమీర్ పేట స్టేషన్ల దగ్గర రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. టికెట్ల అమ్మకాలు ఉదయం 6 గంటలకు అన్ని మెట్రో రైల్ స్టేషన్ల దగ్గర ప్రారంభమవుతాయి. స్టేషన్లలో చివరి ట్రైన్ బయలుదేరడానికి 30 నిమిషాల ముందుగా చివరి ట్రైన్ కు టిక్కెట్ అమ్మకాలు ప్రారంభమవుతాయి.
సింగిల్ జర్నీ టోకెన్:
- నాగోలు, మియాపూర్ మధ్య ఏవైనా రెండు స్టేషన్ల మధ్య ఉపయోగించుకోవచ్చు
- ఒక వేళ ఉపయోగించని టోకెన్ ను 30 నిమిషాలల్లోగా తిరిగిచ్చినట్లయితే..సర్ధుబాటు తర్వాత మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. మార్చి 31,2018 వరకు టైయల్ ఆఫర్ గా మెయింటనెన్స్ ఫీజును తీసుకోవడం లేదు.
- సిస్టమ్ లోపలకు ఎంట్రీ అయిన తర్వాత అది వర్కింగ్ డే కు మాత్రమే చెల్లుతుంది
- టోకెన్ 2 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది
- ఒక వేళ పెయిడ్ ఏరియాలో ఎంట్రీకి టోకెన్ యూజ్ చేసినట్లయితే…ఎలాంటి ఫీజును అందించరు
- వర్కింగ్ డే పూర్తయిన తర్వాత టోకెన్ కు సంబంధించి ఎలాంటి వాపసులు ఇవ్వబడవు
స్మార్ట్ కార్ట్:
- కనీస కొనుగోలు మొత్తం రూ.200(డిపాజిట్ రూ.100),ఇందులో స్టోర్ వాల్యూ రూ.100
- ఒక వేళ కార్డు వాపస్ ఇచ్చినట్లయితే,డిపాజిట్ మొత్తంలో నుంచి 80 రూపాయలను వాపస్ చేస్తారు. మెయింటనెన్స్ ఫీజు కింద రూ.20 వసూలు చేస్తారు
- RBI రూల్స్ ను అనుసరించి స్టోర్ వాల్యూ తిరిగి చెల్లించబడదు
- ప్రయాణంపై సబ్సిడీ-( మార్చి 31,2018 వరకూ స్మార్ట్ కార్డు ద్వారా అన్ని ప్రయాణాలకు 5% ప్రారంభ సబ్సిడీగా అందిస్తారు
- సార్మ్ కార్డు పోయినా/ దొంగిలించబడినా/ బ్రేక్ అయినా ఎలాంటి ఫీజు వాపస్ ఇవ్వబడదు
- గరిష్ట స్టోర్ వాల్యూ రూ.3 వేలు
- కనీస చార్జీ విలువ రూ.100
- కార్టు అందించినప్పటి నుంచీ 365 రోజులు కార్డు చెల్లుతుంది
- టీ సవారీ యాప్, పేటీఎం,హెచ్ఎంఆర్ పాసెంజర్ వెబ్ సైట్, స్టేషన్ కాంకోర్స్ ఏరియాపై ఉన్న పెయిడ్ ఏరియాలోని యాడ్ వాల్యూమెషిన్ ఉపయోగించి స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేసుకోవచ్చు
మెట్రోజర్నీ టై:
- సిస్టమ్ లో అనుమతించే గరిష్ట ప్రయాణ సమయం-3గంటలు
- అదే స్టేషన్ లో అనుమతించే గరిష్ట ప్రయాణ సమయం-30 నిమిషాలు
ఇవి పాటించక పోతే జరిమానా తప్పదు:
- టిక్కెట్ లేని ప్రయాణం చేస్తే రూ.50 నుంచి ఆ పై జరిమానా విధిస్తారు
- అధిక ప్రయాణం- రెండు స్టేషన్ ల మధ్య టికెట్ ధరలోని తేడా
- సిస్టమ్ లో అధిక సమయం గడుపడం- గంటకు రూ.10..గరిష్టంగా రూ.50
మెట్రో చార్జీలు:
- ప్రయాణికులు స్మార్ట్ కార్డు, టోకెన్ ను మెట్రోరైళ్లలో ప్రాయాణానికి ఎంచుకోవచ్చు. ఈజీ జర్నీకీ ప్రయాణీకులు స్మార్ట్ కార్డులను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు
టోకెన్స్:
- కాంటాక్ట్ లెస్ స్మార్ట్ టోకెన్( CST) అనేది టోకెన్ లోపల మీడియా చిప్ తో లింక్ చేయబడిన పరికరం
- స్టేషన్ ఎంట్రీలు, మా టిక్కెటింగ్ కార్యాలయాల దగ్గర ఉన్న మా టిక్కెట్ ఆఫీస్ మెషిన్(TOM/టిక్కెట్ వెండింగ్ మెషిన్(TVM), పోర్టబల్ టిక్కెట్ ఎనలైజర్(PTA) దగ్గర కొనుగోలు చేయవచ్చు
- ప్రయాణీకులు తాము వెళ్లాల్సిన ప్రాంతాన్ని ఎంచుకుని టిక్కెట్ కొనుగోలు చేయడంతో పాటు టోకెన్ తో పెయిడ్ ఏరియాలోకి ఎంటర్ కావచ్చు.
- ఈ టోకెన్ ప్రవేశం దగ్గర రీడ్ అవుతుంది.దీన్ని తిరిగి బయటకు వెళ్లే దారిలో దాన్ని తిరిగి అందించాల్సి ఉంటుంది. ప్రయాణికులు తాము టిక్కెట్ కొనుగోలు చేసిన స్టేషన్ నుంచి మాత్రమే రైలు ఎక్కవలసి ఉంటుంది
స్మార్ట్ కార్డు:
- మీ డెబిట్, క్రెడిట్ కార్డుల్లాగే నెబులా స్మార్ట్ కార్డు కూడా ఉంటుంది. ఇది వర్ట్యువల్ వాలెట్ లా పనిచేసి.. మీ మెట్రో ప్రయాణ ఖర్చులను చూసుకుంటుంది.స్మార్ట్ కార్డులను స్టేషన్ దగ్గర ఉన్న మా టిక్కెటింగ్ ఆఫీసుల దగ్గర కొనుగోలు చేయవచ్చు. అంతే కాదు వాటిని మా స్టేషన్ లలో ఎక్కడైనా రీచార్జ్ చేసుకోవచ్చు. స్మార్ట్ కార్డును కనీసం రూ.100 చెల్లించి రీచార్జ్ చేసుకోవచ్చు.
- ఒక వేళ కార్డు పోగొట్లుకున్నా… ఎవరైనా కార్డును దొంగిలించినా…మిగిలిన మొత్తం చెల్లించడం జరగదు.