తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో చేపట్టిన మూడు మెట్రో కారిడార్లు త్వరలోనే పూర్తై ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన “హైదరాబాద్ ఇంటర్నేనేషల్ ఆటో షో” ఐదవ ఎడిషన్‌ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో సేవలను ప్రారంభం నుంచి ప్రతీరోజు లక్ష మంది వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. మిగతా రెండు కారిడార్లు పూర్తి అయితే అందుబాటులోకి వస్తే 15 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారన్నారు. టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. మెట్రో అన్ని కారిడార్లు పూర్తై అందుబాటులోకి వస్తే వీరిలో సగం మంది మెట్రో వైపు మళ్లుతరన్నారు.
