ప్రస్తుతం దేశ అంతటా ఎంతో వివాదం సృష్టిస్తున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పద్మావతి .ఈ మూవీపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు ..దాడులు జరుగుతున్నాయి .ఏకంగా దర్శకుడు ,ఈ మూవీ యూనిట్ పై కూడా దాడులు జరిగాయి అని వార్తలు కూడా వచ్చాయి .ఈ మూవీ విడుదలకు సంబంధించి దర్శకుడు పార్లమెంట్ ఫ్యానల్ కమిటీ ముందు హాజరయ్యాడు .అయితే ఈ ప్యానెల్‌కు సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి కూడా వెళ్లారు.
ఈ సమావేశంలో జోషి, ప్యానెల్ ఛైర్మన్ అనురాగ్ ఠాకూర్ సినిమా గురించి మాట్లాడుతూ భన్సాలీపై మండిపడ్డారు. సినిమా సెన్సార్‌కు రాకముందే మీడియా వర్గాలకు ఎందుకు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భన్సాలీ సెన్సార్ బోర్డును అవమానించారని జోషి ఆరోపించారు. దీనిపై భన్సాలీ స్పందిస్తూ.. తనకు వేరే మార్గం దొరకలేదని సినిమాలో ఎలాంటి తప్పుడు సన్నివేశాలు చూపించలేదని నిరూపించుకోవడానికే స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశానని ఆయన చెప్పారు.
సినిమాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే తాను చాలా నష్టపోయానని భన్సాలీ ప్యానెల్‌కు వివరించారు. మరోవైపు భన్సాలీ ఇలాంటి ఎమోషనల్ ఇష్యూతో సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారని ప్యానెల్ ఆరోపించింది. సినిమా ఫిక్షనల్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించినప్పుడు అందులో అసలు పేర్లు వాడాల్సిన అవసరమేముందని సెన్సార్ బోర్డు ఆయన్ని ప్రశ్నించింది.