బాలీవుడ్‌లో పరిపూర్ణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. ఈ విషయం తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన డర్టీ పిక్చర్‌తో నిరూపించింది. అంతకు ముందు విద్యా బాలన్ అంటే సాంప్రదాయ సినిమాలే చేస్తుంది. అవార్డు తెచ్చిపెట్టే సినిమాలే చేస్తుంది అంటూ వస్తున్న పుకార్లను తిప్పికొడుతూ డర్టీ పిక్చర్ చిత్రంలో నటించి అందరికి షాక్ ఇస్తూ హాట్‌బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది విద్యాబాలన్.
అంతేకాదు, విద్యా బాలన్ పరిపూర్ణ నటిగా పేరు పొందడానికి గల కారణాల్లో లిప్‌లాక్ సీన్స్ కూడా ఒక కారణం. డర్టీ పిక్చర్ చిత్రం తరువాత ఆమె నటించిన ప్రతి చిత్రంలోనూ హీరోలతో సమానంగా నటిస్తూ.. లిప్‌లాక్ సీన్స్‌లలో బోల్డ్‌గా నటించింది. అంతేకాదు. కేవలం హీరోలకేనా.. హీరోయిన్‌లకు లిప్‌లాక్ ఇవ్వరా..? అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఖంగుతినే సమాధానం ఇచ్చింది విద్యాబాలన్. అదేమిటంటే.. కథ డిమాండ్ చేస్తే దానికి కూడా తాను సిద్ధమేనని చెప్పింది.
అయితే, ఇటీవల కాలంలో విద్యా బాలన్ కాస్తా బొద్దుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాస్తా.. గమనించిన మీడియా విద్యా బాలన్‌ను ఇదే విషయమై ప్రశ్నించారు. దీంతో విద్యాబాలన్ ఇచ్చిన సమాధానానికి ఖంగుతినడం మీడియా వంతైంది.
ఇంతకీ విద్యాబాలన్ ఎం చెప్పిందంటే.. మీరేమైనా అడగదలుచుకుంటే నేను నటించిన.. నటించబోయే సినిమాల గురించే అడగండి. .అంతేకానీ.. అంతకు మించి నన్ను అడగొద్దంటూ మాటల ఎదురు దాడి చేసింది విద్యాబాలన్. అవును నేను బొద్దుగానే కనిపిస్తున్నాను.. నా శరీరతత్వమే అంత.. అయినా, నేను బొద్దుగా ఉంటే బాగాలేనా..? అంటూ ప్రశ్నించింది. నా నిర్మాతలకు, హీరోలకు, సినిమా చూసే ప్రేక్షకులకు లేని సమస్య కొంతమందికే ఎందుకు వస్తుంది అంటూ మీడియా వారిపై నిప్పులు చెరిగింది.
‘బాడీషేమింగ్’ పేరుతో చాలా దారుణమైన పోస్టింగ్స్ కన్పిస్తుంటాయనీ, చాలామంది హీరోయిన్లకి ఈ పరిస్థితి ఎదురవుతుండడం బాధ కలిగించే అంశమని చెప్పుకొచ్చింది. ఇకపై తాను సన్నబడ్డం అనేది జరగదనీ, లావుగా వుండడం నేరమేమీ కాదని, లావుగా వున్నవారిపై సినిమాల్లోనూ హద్దులు దాటే హాస్యం క్షమించదగ్గ విషయం కాదని విద్యాబాలన్ అభిప్రాయపడింది.