సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్‌తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్‌గా నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రంలో తనలోని రొమాన్స్‌ను వెలికి తీసింది భామ.
అయితే, ఎంసీఏ చిత్ర బృందం తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని వాల్‌పోస్టర్స్‌ను విడుదల చేసింది. ఆ వాల్‌పోస్టర్‌లో ఒకటి.. కిటికీకి అవతల వైపున నాని, సాయిపల్లవి ఉన్న దృశ్యం ఒకటి ఉంది. ఆ వాల్‌పోస్టర్స్‌లో సాయి పల్లవి లుక్స్ చూసిన నెటిజన్లు.. నీ కోసమే ఎదురు చూస్తున్నానంటూ నానితో అంటున్నట్లు తమ మదిలోని మాటను నెట్టింట్లో పెట్టారు. అందులోనూ ఆ పోస్టర్స్‌లో ఉన్న సాయి పల్లవి లుక్స్ నెటిజన్ల ఊహకు దగ్గరగా ఉండటంతో నిజమేమో అనుకుంటున్నారు కామెంట్లు చదివిన వారంతా. మరి ఇది నిజమో.. కాదో సినిమా విడుదలైతే కానీ తెలియదు కదా..!