తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు అయిన హిమాన్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయన మనవడ్ని మంత్రిగా చేస్తారు అని ఆయన ఆరోపించారు .ఇప్పటికే కొడుకు కేటీఆర్ ,అల్లుడు హరీష్ రావును మంత్రిగా చేసిన ఆయన రాబోయే ఎన్నికల్లో గెలిస్తే మనవడ్ని కూడా మంత్రిగా చేస్తారు అని ఆయన అన్నారు ..
