తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర వాసుల ఎన్నో యేండ్ల కల “హైదరాబాద్ మెట్రో “మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంతో హట్ట హసంగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయబడింది .ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో రైల్ లో మొదటి రోజు మొత్తం పద్నాలుగు రూట్లలో రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించి దేశంలో ఇప్పటివరకు ఉన్న పలు రికార్డ్లను బద్దలు కొట్టింది .
రెండో రోజు కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు .నిన్న గురువారం రెండో రోజు నగరంలో మెట్రో లో ఒక లక్ష అరవై వేలమంది ప్రయాణించారు .మొదటి ,రెండు రోజులు కల్పి మూడు లక్షల అరవై వేల మంది ప్రయాణం చేశారు .అయితే నగరంలో మెట్రో స్టార్టింగ్ పాయింట్ నాగోల్ ,మియాపూర్ ,ఇంటర్ చేంజ్ స్టేషన్ అమీర్ పేట్ లో భాగా రద్దీ కన్పించింది .