రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.
ఈ నెల 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశ విదేశాల నుంచి మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 6 వేల మందికి పైగా నమోదు చేసుకున్నరని మంత్రి స్పష్టం చేశారు.మహా సభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎం, మహారాష్ట్ర గవర్నర్ హాజరవుతారన్నారు. మహాసభలు నిర్వహించి తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి తెలియజేశారు. 14 రోజుల పాటు సిద్దిపేట జిల్లాలో సాహిత్యపరమైన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అన్నారు. బతుకమ్మ పాటల సంపుటి తీసుకురావడంతో పాటు ఆముద్రిత రచనల ముద్రణ, కవి సమ్మేళనాలు నిర్వహించాలని హరీశ్ రావు వివరించారు.ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, యాదగిరి రెడ్డి హాజరయ్యారు.