Home / LIFE STYLE / న‌డుం నొప్పా.. ఇలా చేస్తే నో టెన్ష‌న్‌..!

న‌డుం నొప్పా.. ఇలా చేస్తే నో టెన్ష‌న్‌..!

న‌డుం నొప్పి అనేది తరచుగా పనిచేసే మహిళల్లో ఒక సాధారణ సమస్య, అయితే, ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లు న‌డుం నొప్పిని ఆదిలోనే నివారించ‌కుండా.. నొప్పి శాతం పెరిగిన త‌రువాత జాగ్ర‌త్త‌లు పాటిస్తుంటార‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌లో తేలింది. అయితే, కాల్షియం, విట‌మిన్ డి, నిద్ర లేక‌పోవ‌డం, ఎముక‌ల‌పై ప్ర‌భావం చూపేలా నిద్ర‌పోవ‌డం వంటివి న‌డుం నొప్పికి కార‌ణాల‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే, న‌డుం నొప్పే క‌దా..! అని ఉపేక్షించ‌కుండా.. నొప్పి ప్రాథ‌మిక స్థాయిలోనే ఉన్న‌ప్పుడు నివారిస్తే ఎంతో మేలంటున్నారు వైద్యులు.

1. ఈ అల‌వాట్లు మానుకోవాల్సిందే..

ఎక్కువ స‌మ‌యం కూర్చోవ‌డం, అలాగే, చాలాసేపు నిలబడి లేదా చెడు భంగిమలో పడుకోవడం వంటి అల‌వాట్లు వెన్నెముకలో ఒత్తిడికి దారితీస్తుంది. ఎక్కువ బాధ‌ను క‌లుగ‌చేస్తుంది. ఇంద‌కు కార‌ణం ర‌క్త ప్ర‌స‌ర‌ణ చేసే అవ‌య‌వాల‌పై ఆ అల‌వాటు ప్ర‌భావం చూప‌డ‌మే. ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే న‌డుం నొప్పితోపాటు.. ఇత‌ర వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పరిశోధ‌కులు అంటున్నారు.

నిలబడి ఉండగా, మీరు మీ భుజాలను వేలాడదీయడం లేదా వంపు తిరగడం వంటి చ‌ర్య‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించాలి. న‌డుం నొప్పితో బాధ‌ప‌డుతున్న వారు ఎర్గోనామికల్ కుర్చీలో నేరుగా కూర్చోవ‌డం అలాగే.. ప‌నిలో ఎక్కువ స‌మ‌యం నిమ‌గ్నం కావ‌డాన్ని నివారించాలంటున్నారు వైద్యులు.

2. చల్లచల్లగా..

నొప్పిని, వాపును తగ్గించడంలో ఐస్‌ను మించింది మరోటి లేదు. అందుకే కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్‌లో మూటకట్టాలి. దీంతో నొప్పి ఉన్న ప్రదేశంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ఇలా నొప్పి తగ్గేంత వరకూ అరగంటకోసారి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది.

3. బ‌రువులు ఎత్త‌డం..

మిమ్మ‌ల్ని ఇప్ప‌టికే న‌డుం నొప్పి ఎక్కువ‌గా బాధిస్తున్న‌ట్ల‌యితే. ఏదైనా భారీ బరువుల‌ను ఎత్త‌క‌పోవ‌డ‌మే మంచిది. ఉ దాః –
భారీ బ‌కెట్లు, పిల్ల‌ల‌ను ఎత్తుకోవ‌డం, వెన్నెముక‌పై ప్ర‌భావం చూపేలా భారీ బ‌రువులను ఎత్త‌డం వంటివి మంచిది కాద‌ని చెబుతున్నారు ప‌రిశోధ‌కులు.

4. ఎక్కువ‌గా ఇవి తీసుకోండి..

మీరు ప్ర‌తి రోజూ తీసుకునే ఆహారంలో తగినంత కాల్షియం ఉందా..? లేదా..? అన్న‌ది ఒక్క‌సారి ప‌రిశీలించండి. మీ ఆహారంలో విటమిన్ – డి పూర్తిగా ఉండేలా చూడండి. కాల్షియం కోసం చేప, గుడ్డు, విటమిన్ డి తీసుకోవడం కోసం పాలు, పెరుగు, ఆకుపచ్చ ఆకు కూరలు తీసుకోండి. మీ వెన్నెముక‌ను బ‌లోపేతం చేయ‌డానికి మీ ఉద‌ర కండ‌రాల‌ను బ‌ల‌ప‌ర‌చండి. ఇది మీరు ఉత్సాహంగా ప‌నిచేసేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

5. ఇంకా..

నడుం నొప్పిని తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగా, ఈత.. వంటి సులభమైన వ్యాయామాలను చేయడం మంచిది. వారానికి కనీసం మూడు గంటల పాటు ఈ రకమైన వ్యాయామాలు చేయడం వల్ల నడుంనొప్పిని 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

చూశారుగా.. నడుంనొప్పిని సహజసిద్ధంగా తగ్గించుకునేందుకు ఎలాంటి మార్గాలున్నాయో. మరి మీకెప్పుడైనా నడుంనొప్పి వేధిస్తున్నట్లయితే వీటిని పాటించి నొప్పి నుంచి ఉపశమనం పొందండి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat