కండోమ్స్ వాడితేనే మగాడివి. లేదంటే అనేక జబ్బులకు కారకుడివి అవుతావని ఓపెన్‌గా చెప్పేసింది ఒక బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్. ప్రస్తుతం ఒక కండోమ్ యాడ్ కోసం షూట్ చేస్తున్న ఈ అమ్మడు, కండోమ్స్ లో ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయో వరసపెట్టి చెప్పేస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..
సినీ ప్రియులకు కొత్తగా పరిచయం అవసరంలేని పేరు రాఖీ సావంత్. బాలీవుడ్ లో సంచలనాత్మక స్టేట్ మెంట్స్ ఇవ్వాలన్నా, సంచలనాత్మక పనులు చేయాలన్నా ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఒక కండోమ్ యాడ్ లో ఆమె నటిస్తోంది. ఈ సందర్భంగా, యాడ్ టీమ్ అంతా కలిసి, ముందుగానే ప్రమోషన్స్ మొదలెట్టేశారు. తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటూ, మగాళ్లందరూ కండోమ్స్ వాడాలని సూచించింది రాఖీ సావంత్. తాను బీ బాయ్ అనే కండోమ్ యాడ్ లో నటిస్తున్నానని, దీనిలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయని ఆమె చెబుతోంది. “మీ రక్షణ కోసం తప్పనిసరిగా కండోమ్ ను వాడండి, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. సన్నీ లియోన్ కు, బిపాషా బసుకు పోటీగా నా యాడ్ రాబోతోందని, అంతేకాదు తన జేబులో కూడా ఎప్పుడూ కండోమ్ వుంటుందని తెలిపింది.