ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో ఆ కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ పై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా విరుచుకుపడ్డారు .ఒకనోకసమయంలో ఆయన మోదీ సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఏపీకి కేంద్రం చేసిన సహాయం గురించి సభ్యులకు వివరించారు .
ఈ క్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర సర్కారు పదమూడు సంస్థలను ఏర్పాటు చేసిన కానీ వాటికి మాత్రం నిధులు అరకొరగా ఇచ్చింది .మొత్తం పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు విద్యాసంస్థలకు అవసరమైతే కేవలం కేంద్రం ముప్పై ఏడు కోట్లు మాత్రమే ఇచ్చింది అని ఆయన అన్నారు .అయితే ,దుగరాజపట్నం పోర్టు సాధ్యం కాదు అని నీతి అయోగ్ స్పష్టం చేసిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు .
రాష్ట్రానికి పదమూడు షెడ్యుల్ లో రావాల్సిన వాటిలో ఇప్పటికే తొమ్మిది వచ్చాయి .అయితే ఇంకా సెంట్రల్ ,గిరిజన విశ్వవిద్యాలయాలు రావాలి .అయితే ఏపీ యాక్ట్ లో లేని సంస్థలు పదమూడు వచ్చాయని ఆయన వివరించారు .9 ,10 షెడ్యుల్ లో సంస్థలు ఇంకా విభజన జరగలేదు .విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు .ఆస్తులు పంపకం మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టుకు పోతామని ఆయన తేల్చి చెప్పారు ..