తమిళనాడు ముఖ్యమంత్రి,అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ “జయలలిత “అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పలు మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే .అమ్మ మరణం తర్వాత రాజకీయ రణరంగం ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి పళనీ ,పన్నీరు వర్గం చేతికి అధికార పీటం దక్కింది .
అధికారం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు విశ్వప్రయత్నాలు చేసిన చిన్నమ్మ ఆఖరికి జైలు బాట పట్టింది .అయితే అమ్మ అకాలమరణంతో త్వరలో జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎం పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధిని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది .ఈ క్రమంలో అధికార పార్టీ అధ్యర్ధిగా ఈ .మధుసూదన్ బరిలోకి దిగనున్నారు .
ఈ నెల 21 తేదిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగనున్నది .ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అధికార పక్షం ఎలా అయిన గెలవాలని అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ అయిన మధుసూదన్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది .