వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండని సైతం లెక్క చేయకుండా జగన్ నడకని ఆపకపోవడంతో ఆయన అరి కాళ్ళు, బొటన వేళ్ళకి పుండ్లు పడి బొబ్బలు కడుతున్నాయి.
అయినా పట్టించుకోకుండా తనకోసం వస్తున్న ప్రజల కష్టాలను తెలుసుకోవడానిక తనుభవిస్తున్న బాధను సైతం లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అంతేగాక ఓ కాలులో ముల్లు కూడా గుచ్చుకుంది. దీంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు వైద్యులు
అయితే, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కొనసాగించేందుకే మొగ్గు చూపడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న జగన్ సతీమణి వైఎస్ భారతి అక్కడకు చేరుకున్నారు. తన భర్త కాళ్లకు ఉన్న బొబ్బలను చూసి కొంత ఆందోళన చెందిన…ప్రజల కోసం తన భర్త పడుతున్న కష్టం చూసి గర్వంగా ఫీలైయిన్నట్లు సమచారం. నీ కాళ్లకు గాయం మానుతుంది..కాని ఏపీ ప్రజల గుండెల్లో నీ స్థానం చివరి వరకు ఉంటుంది. ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నీవు కాపాడాలని చెప్పినట్లు సమచారం..