ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ పార్టీ వర్గీయుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండల౦ పచ్చర్ల వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తిరుపతిరెడ్డి పై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. గాయపడ్డ తిరుపతిరెడ్డిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు 13 కుట్లు వేశారు.దాడి చేసిన టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది.
