క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తప్పులు చేయకుండా వారిని సరిదిద్దాలి. కానీ, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అవమానిస్తున్నారు. ఇదే తరహలో ఓ స్కూల్‌లో 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్‌లో క్లాస్ టీచర్‌పై విద్యార్థులు అసభ్యరాతలు రాశారు. అయితే విద్యార్థులు క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాసిన ఘటనపై టీచర్లు విద్యార్థులకు దారుణమైన శిక్షను అమలు చేశారు. టీచర్‌పై రాసిన అసభ్యరాతలకు సంబంధించిన కాగితం ముక్క పూర్తిగా దొరకలేదు. సగభాగం మాత్రమే విద్యార్థులకు అందింది. మిగిలిన సగభాగం కోసం విద్యార్థులపై కఠినంగా శిక్షను అమలు చేశారు ముగ్గురు టీచర్లు.
క్లాస్ టీచర్‌పై అసభ్య రాతలు రాసిన కాగితం ముక్క కోసం 88 మంది విద్యార్థినులను తోటి విద్యార్థినుల ముందే బట్టలిప్పించారు. ఆరు, ఏడు తరగతులకు చెందిన విద్యార్థినుల బట్టలను విప్పి నిలబెట్టారు.విద్యార్థుల బట్టలు విప్పి కాగితం ముక్క కోసం వెతికారు.కాగితం ముక్క కోసం వెతికారు. కానీ, కాగితం ముక్క దొరకలేదు. కాగితం ముక్క కోసం విద్యార్థులను అలాగే నగ్నంగా నిలబెట్టారు. అయితే బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వాస్తవమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు