తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు.జీఈఎస్ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు .. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. జీఈఎస్ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు.
ఈ సదస్సులో మూడు రోజుల పాటు 53 డిస్కసన్లలో 200 మంది స్పీకర్లు మాట్లాడినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య మరింత పెరగాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు వల్ల భారత్ – అమెరికా మైత్రి మరింత బలపడుతుందన్నారు. టీ హబ్‌ను ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్ ప్రశంసించారని మంత్రి తెలిపారు.ప్రొక్యూర్‌మెంట్ విధానంలో మహిళలు నిర్వహించే ఎస్‌ఎంఈలకు అవకాశం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంట్రీప్రెన్యూర్లకు రాష్ట్ర ప్రభుత్వం టీ ఫండ్‌తో చేయూతనందిస్తున్నదని మంత్రి చెప్పారు. ఎంట్రీప్రెన్యూర్లను జీఈ సదస్సు ఓ మంచి వేదికలా నిలిచిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.