తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగంలో అత్యంత ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు 2018 ఫిబ్రవరిలో ఇవాంక ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన ప్రసంగంలోనూ దీనినే ఆమె పేర్కొన్నారు. జీఈఎస్‌లో భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్ తాను ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉందని ఇవాంకతో ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. అయితే అమెరికాకు వచ్చినట్టయితే తనను తప్పకుండా కలువాలని ఇవాంక సూచించినట్టు సమాచారం.
