ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చంద్రబాబు సర్కార్ చేస్తున్న అవినీతి, రౌడీయిజం, భూ కబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నేరాలు చేస్తున్నారు. అయితే, జగన్ చేపట్టిన ఈ యాత్ర ప్రజల్లో భరోసాను నింపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభిచారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా కుప్పలదొడ్డి, బిల్లకల్ వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. రాత్రి అక్కడే ఆయన బస చేయనున్నారు.
జగన్ గుండెల్లో బాధ…
అయితే, రాయలసీమలో ఉన్న కరువు జిల్లాల్లో కర్నూలు జిల్లా ఒకటన్న విషయం తెలిసిందే. నాడు జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు ఇచ్చి.. కర్నూలు జిల్లా నుంచి కరువును దూరం చేస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కాడు. చంద్రబాబే కదా.. అనుభవం ఉంది కదా.. కర్నూలు జిల్లా నుంచి కరువును దూరం చేస్తాడని నమ్మిన ప్రజలు సాధారణ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేశారు. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు.. తానింకా మాయ మాటల మరాఠీనేనని, తనలో కుఠిల రాజకీయం ఇంకా ఉందని నిరూపిస్తూ.. ప్రజల హామీలను మరిచారు. ఎన్నికల సమయంలోనే ప్రజలతో కలుస్తానని మరో సారి నిరూపించాడు చంద్రబాబు. ఇది కాస్తా కర్నూలు జిల్లా ప్రజలపాలిట శాపంగా మారింది. కర్నూలు జిల్లా ఇప్పుడు కరువుతో అల్లాడుతోంది. ఎంతలా అంటే.. అటు ప్రత్యక్ష్యంగాను,ఇటు పరోక్ష్యంగానూ ముసలి వారి నుంచి.. చిన్నారులపై కూడా ఈ కరువు తన ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఈ విషయం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో వెలుగులోకి రావడం గమనార్హం.
ఇంతకి ఏం జరిగిందంటే.. బుధవారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైెస్ జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను జగన్ కు విన్నించారు. ‘అన్నా.. మా ఊర్లో వర్షాకాలమే పనులుంటాయ్.. డిసెంబర్ వచ్చిందంటే బతుకుదెరువు కోసం మా తల్లిదండ్రులు కడప, హైదరాబాద్, బెంగళూరు, గుంటూరుకు వలస వెళ్తారు. మమ్మల్ని కూడా బడి మాన్పించి వారి వెంటే తీసుకెళుతుండటంతో చదువుకు దూరం కావాల్సి వస్తోంది’.. అంటూ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఉమా, జరీనా, గీతాంజలి, రాజేశ్వరి, భావన తదితరులు జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రజాసంకల్ప యాత్ర గంజిహళ్లిలో కొనసాగుతుండగా వారు జగన్‌ను కలిసి తమ ఊరిలోనే హాస్టల్ ఏర్పాటు చేయించాలని, లేదంటే తమ తల్లిదండ్రులకు ఇక్కడే ఏదైనా పనికల్పించాలని కోరారు.ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రజలు చెప్పిన సమస్యలను విన్న జగన్ ఒక్కసారిగా చలించిపోయారు. యాత్ర ముగిసిన తరువాత బస చేసిన ప్రదేశంలో ప్రజలు చెప్పిన జీవితాల గురించి పక్కనున్న వైసీపీ నాయకులతో జగన్ బాధతో వారి సమస్యలు తీర్చే విధంగా మన పార్టీని ముందుండి నడిపిద్దాం అని చెప్పినట్టు సమాచారం.